మెదక్,నవంబర్,26,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి
మెదక్ విద్యుత్ శాఖ నూతన డివిజనల్ ఇంజనీర్ (డిఈ)గా రామేశ్వర్ స్వామీ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.సంగారెడ్డి టి ఆర్ఈ ఏడిఈగా విధులు నిర్వహిస్తున్న రామేశ్వర స్వామీ పదోన్నతిపై మెదక్ డివిజన్ డిఈ నియమితులయ్యారు.
ఈసందర్భంగా మెదక్ విద్యుత్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రామేశ్వర స్వామీ మాట్లాడుతూ విద్యుత్ అధికారులు,సిబ్బంది సహకారంతో మెదక్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ఈకార్యక్రమంలో 1104 యూనియన్ నాయకులు నేత ప్రసాద్, విఠల్ , రాంపురం నాగేష్, వరప్రసాద్, కామారం శ్రీనివాస్, వి ఎల్ ఎన్, రెడ్డి, విజయ్ కుమార్, రవీందర్ గౌడ్,మరాఠీ శ్రీనివాస్, ఇబ్రహీం,దుర్గా ప్రసాద్,టేక్మల్ సంగయ్య,బలరాం, తదితరులు పాల్గొన్నారు.
