MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 2:49 pm Digital Edition : Medak Today

మెదక్ జిల్లాలో జూదంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఉక్కుపాదం

-నలుగురు అరెస్ట్ – ఇద్దరు పరారీలో

-రూ.4,750 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం

– ఎస్ పి శ్రీనివాసరావు ఐపీఎస్.

మెదక్,మార్చి,20,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)మెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలం సిలంపల్లి గ్రామ శివారులోని డంప్‌యార్డు సమీపంలో అక్రమంగా జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్ పి శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో వెంకటాపురం లక్ష్మణ్, జుకంటి లోకయ్య, మన్నె ప్రసాద్, యల్లయ్యగారి భూమ్ రెడ్డి ఉన్నారు. ఈ ఘటనలో రాకేష్, పెద్దొల్ల సుధాకర్ రెడ్డి పరారీలో ఉండగా, సంఘటనా స్థలం నుండి రూ.4,750 నగదు మరియు 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చిల్పిచేడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.