MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 1:19 pm Digital Edition : Medak Today

కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు..

మెదక్, నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు

ముడుపుల మత్తులో కన్నెత్తి చూడని ఆబ్కారి అధికారులు

మద్యం ఏరులై పారుతున్న గ్రామాలు పట్టణాలు చోద్యం చూస్తున్న అధికారులు

మత్తు పదార్థాలకు బానిస అవుతున్న నేటి తరం యువత

బెల్ట్ షాపులపై నాజర్ వెయ్యని అధికారులు రాజకీయ నాయకులు

పట్టణాల్లో పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది

పుట్టగొడుగుల వెలుస్తున్న బెల్ట్ షాపులు

ప్రతి కిరాణా కొట్టు ప్రత్యామ్నాయ బెల్టు షాపే

ఎనీ టైం కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు

బెల్ట్ షాపులపై జిల్లా కలెక్టర్ అబ్కారి అధికారులు ప్రత్యేకంగా నిఘ ఏర్పాటు చేయాలని ప్రజల ఆవేదన

వైన్ షాపులను తలదన్నేలా బెల్ట్ షాప్ ల అడ్డగోలు దందాలు

ఎమ్మార్పీకి మించిన ధరలు

బెల్ట్ షాపులది అదనపు భారం

మెదక్, నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి.

పల్లెలో పట్టణాల్లో రాత్రింబవళ్లు కిక్కు ఎక్కిస్తున్న బెల్ట్ షాప్ లు పల్లెల్లో బెల్ట్ షాప్ ల దందా జోరుగా సాగుతుంది తాగేందుకు గుక్కెడు నీరు లేని మారుమూరు ప్రాంతాల్లో మందు ఏరులై పారుతుంది ముడుపుల మత్తులో కన్నెత్తి చూడని ఎక్సైజ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా గ్రామాల్లో పట్టణాల్లో పుట్టగొడుగుల పెరుగుతున్న బెల్టు షాపులు పల్లెలు పట్టణాలు గల్లిగల్లి లో మత్తులో జరుగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు అనేకమంది బెల్ట్ షాపులు మద్యం కొనుగోలు చేసి జేబులో చేసుకుంటున్నారు అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధుల పాలవుతున్నాయి మద్యం ఏరులై పారుతున్న గ్రామాలు పట్టణాలు
గ్రామాలు పట్టణాలు మన తేడా లేకుండా పుట్టగొడుగుల బెల్ట్ షాపులు పెరగడంతో మద్యం ఏరులై పారుతున్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల నిర్లక్ష్య వైఖరికి ఇది కూడా కారణమే వైన్ షాపులో సమయ వేళలు పాటించడం వల్ల కొంత కట్టడికి దారి ఉంటుంది కానీ బెల్ట్ షాపులు 24 గంటలు ప్రజాసేవలో ఉండటం వలన మందుబాబులకు కిక్కు కరువు లేకపోలేదు పల్లె ప్రాంతాల్లో బెల్ట్ షాపుల పోటీ తత్వం రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతుంది బెల్ట్ షాపులపై నాజర్ వెయ్యని అధికారులు రాజకీయ నేతలు
గ్రామాల్లో పట్టణాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుక రావడంతో యువత మత్తుకు బానిసవుతున్నారు వైన్ షాపుల యాజమాన్యం కూడా బెల్టు షాపులకు జోరుగా నడిపించేందుకు అండదండగా ఉంటున్నారు మండలానికి రెండు వైన్ షాపులు ఉన్నట్టయితే మండలం మొత్తం మీద గ్రామాల్లో కలిపి 200కు పైగా బెల్ట్ షాపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి బెల్ట్ షాప్ లపై ఎక్సైజ్ అధికారులు కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది సుమారుగా ఒక్కొక్క గ్రామానికి మూడో నుంచి 4 బెల్ట్ షాపులు దర్జాగా దందాలు చేసుకుంటున్నారు స్థానిక నాయకులు కూడా చర్యలు తీసుకోకుండా అధికార దాహంతో యువత భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న మరికొందరు నాయకులు మద్యపానం నిషేధం అని చెప్పాల్సిన నాయకులే మద్యానికి యువతను బానిసను చేస్తున్నారు ప్రతి కిరాణా దుకాణం ప్రత్యామ్నాయ బెల్ట్ షాపే పల్లెల్లో సుమారుగా అన్ని కిరణం దుకాణాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువయ్యాయి మరికొన్ని కిరాణా దుకాణాల్లో నామమాత్రంగా కిరాణా వ్యాపారం చేస్తూనే అక్రమంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి లాభాల గాడిలో ఉండాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్న బెల్ట్ షాపులు మందుబాబులు కూడా నియంత్రణ నివారణ మార్గమని ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోగలుగుతారు
ఎనీ టైం కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు రాత్రింబవళ్లు తేడా లేకుండా కిక్కు ఇస్తున్న బెల్ట్ షాపులు వైన్ షాపులను తలదన్నేలా బెల్ట్ షాపులు అడ్డగోలుగా అక్రమంగా మాద్యం విక్రయిస్తూ మందు బాబుల నుండి నిలువు దోపిడి నిర్భయంగా జరుగుతుంది ఆంక్షలు విధించేవారు అడ్డు చెప్పేవారు కరువు వైన్ షాపుల విక్రయాల కంటే బెల్ట్ జోరు గా పరుగులు పెడుతుంది పల్లెల్లో బెల్ట్ షాపుల పై సూక్ష్మంగా నిఘా లేదంటున్న ప్రజలు
బెల్ట్ షాపులది అదనపు భారం
బెల్ట్ షాపుల్లో మందుబాబులపై అదన భారం మోపుతుంది వైన్ షాపులో ఎమ్మార్పీ ధరల కంటే ఒక క్వార్టర్ పైన 30 నుండి 40% వరకు సొమ్ము చేసుకుంటున్నా వైనం దండుకోవడం ఒకవైపు అయితే గల్లీలో బెల్టుల క్రేజ్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది బెల్ట్ షాప్ ల వారు అదనంగా 20 రూపాయలు పెంచి కస్టమర్లకు విక్రయిస్తున్నారు విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపు నిర్వాహకులు ఎవరికి నచ్చిన విధంగా వారు ధర నిర్ణయించుకొని క్వార్టర్ పైన 30 రూపాయలు ఫుల్ కనీసం 120 రూపాయలు బీరు పైన 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు వైన్ షాప్ లో ఉండే ప్రతి బ్రాండ్ మద్యం బెల్ట్ షాపుల్లో ఉండటం గమనార్హం ప్రతి ఒక్క గ్రామంలో గల్లి గల్లి కి బెల్ట్ షాపులు వెలగటంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసిన అధిక ధరలకు విక్రయిస్తున్నారు అధిక ధరలే కాకుండా ఖాతా బుక్కు పెట్టి వడ్డీ వసూలు కూడా చేస్తున్నారు అని కుటుంబ సభ్యులు వాపోతున్నారు దీనివలన అనేకమంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జోబులు గుల్ల చేసుకుంటున్నారు అప్పులు చేసి తాగటం వల్ల కుటుంబాలు రోడ్డున పాలవుతున్నాయి ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు గ్రామాల్లో బెల్ట్ షాపుల మూసివేత దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పూర్తిగా మద్యం విక్రయించకుండా ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు.