•బాల్య వివాహాలు చట్ట నిత్య నేరం
ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి,
•బాలికలను రక్షిద్దాం బాల్య వివాహాలను అరికడదాం
•సి డి పి ఓ స్వరూప రాణి
చేగుంట నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్
బాల్య వివాహాల నిర్మూలనకై అవగాహన సదస్సు రామయంపేట సిడిపిఓ స్వరూప రాణి ఆధ్వర్యంలో బుధవారం నాడు చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు, సీ డి పి ఓ స్వరూప రాణి మరియు ఎమ్మార్వో శివప్రసాద్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బాల్య వివాహాలు నేరం అని భారత శిక్షస్మృతి (ఐపిసి) 1860 లోని 375వ సెక్షన్ లో పేర్కొనబడింది బాల్య వివాహాలను నిరోధించడానికి మరియు బాల్య వివాహాలకు సంబంధించిన నేరాలను శిక్షించడానికి ఈ చట్టం రూపొందించబడింది,
బాల్య వివాహం అంటే ఏమిటి,
బాల్య వివాహం అంటే 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలుడు మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలిక యొక్క వివాహం,
బాల్య వివాహాలు చట్ట విరుద్ధం ఇది ఒక నేరం,
బాల్య వివాహాలకు సంబంధించిన నేరాలు, బాల్య వివాహం జరిపించడం, బాల్య వివాహనికి సహకరించడం, బాల్య వివాహాలకు సంబంధించిన శిక్షలు బాల్య వివాహాలు జరిపినట్లయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష 100,000 రూపాయలు జరిమానా, బాల్య వివాహాలు చట్ట నిత్య నేరం బాల్యనీ రక్షించండి విద్యను ప్రోత్సహించండి బాలికలను శక్తివంతం చేయండి అని వారు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో సిడిపిఓ. స్వరూప రాణి, ఎమ్మార్వో శివ ప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, ఎంపీడీవో చెన్నారెడ్డి, సూపర్వైజర్, షైనీ సువర్ణ, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, వివిధ గ్రామాల ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడి ఆయలు, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.