వెంకంపల్లి – పాపన్నపేట బ్రిడ్జి మంజూరుపై ఎమ్మెల్యే రోహిత్‌కు పాలాభిషేకం.
పాపన్నపేట,జూలై,5,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి. దుర్గేష్ గౌడ్ వెంకంపల్లి నుండి పాపన్నపేట వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం లభించడంతో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండలంలోని ఆదివారం సుభాష్ చంద్రబోస్ చౌరస్తా లో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ,ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి మంజూరు కావడం స్థానికులకు ప్రయోజకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోహిత్ చేసిన కృషి ఫలితంగానే...