MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 12:10 pm Digital Edition : Medak Today

కాళోజి నారాయణరావుకు ఘన నివాళి..

కాళోజి నారాయణరావుకు ఘన నివాళి

చేగుంట నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్

తపస్ ఆధ్వర్యంలో చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా వారికీ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ
పుట్టుక నీది, చావు నీది, బతకంతా తెలంగాణగా జీవించిన చలనశీలి అని,
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి – అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అని, అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు అని సగర్వంగా ప్రకటించన గొప్ప వ్యక్తి అని వారన్నారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, తపస్ మండల అధ్యక్షులు రావుల వెంకటేష్, రాధ, సరస్వతి, భవాని, రమాదేవి, శారద,శ్రీవాణి, ఉమామహేశ్వరి, ఉమా దేవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.