మాసాయిపేట హత్య కేసులో నలుగురి అరెస్ట్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్.
చేగుంట,ఏప్రిల్,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాసాయిపేట మండలం, మాసాయిపేట గ్రామంలో కల్లు దుకాణం వద్ద జరిగిన గొడవలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను చేగుంట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న రాత్రి మాసాయిపేటలోని కల్లు దుకాణం వద్ద వడ్డెర నగేష్ అనే వ్యక్తి బాటిళ్లు పగలగొడుతుండగా, అదే గ్రామానికి చెందిన గుడ్డి దశరథ్ (49) వారించాడు. దీంతో ఆగ్రహానికి...