మార్పిడి తో కానుకలు పక్కదారి .!?
పాపన్నపేట,సెప్టెంబర్,22,మెదక్ టుడే న్యూస్:భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన నాణేలను ఏడుపాయల లోని దుకాణ దారులకు దేవదాయ శాఖ అధికారులు,సిబ్బంది మార్పిడి చేస్తున్నారు. చిల్లర నాణేలతో పాటు బంగారు వెండి అభరణాలు పక్కదారి పడుతున్నాయని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.!? అధికారులు,సీసీ కెమెరా సమక్షంలో గోకుల్ ఫంక్షన్ హల్ లో ఈ లెక్కింపు జరిగిన ఏదో ఒక రూపంలో గత కొన్ని సంవత్సరాలుగా బయటకు వెళ్లవలసినవి వెళ్తున్నాయి. కావున దేవదాయ,ధర్మదాయ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకొవాలని భక్తులు కోరుతున్నారు.