మారిన పాలన.. మారని రాత! దయారాలో నరకప్రాయంగా డ్రైనేజీ వ్యవస్థ.
• మురికి నీటిలోనే అమ్మవారి దర్శనం.. అంగన్‌వాడీకి వెళ్లాలన్నా తప్పని తిప్పలు. • పంచాయతీ నుంచి జిహెచ్ఎంసి కి.. సమస్యలు మాత్రం తీరని వైనం. • పట్టించుకోని అధికారులు.. దయారా గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం. అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని, దయారా గ్రామంలో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గ్రామం పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా, డ్రైనేజీ సమస్య మాత్రం దశాబ్దాల వెనుకబడే ఉంది. దయారాలోని పోచమ్మ దేవాలయం, వివేకానంద విగ్రహం, అంగన్‌వాడీ పాఠశాల...