మానవత్వం చాటుకున్న మెదక్ అదనపు ఎస్ పి మహేందర్..
•క్షతగాత్రులను స్వయంగా అంబులెన్సులో ఎక్కించిన అదనపు ఎస్పీ, మెదక్,జనవరి,28,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి అక్కన్నపేట గ్రామ శివారులోని అక్కన్నపేట ఫారెస్ట్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామం నుంచి పాతూర్ సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడగా, ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.ఇదే సమయంలో రామాయంపేట వైపు వెళ్తున్న మెదక్...