MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 4:04 am Digital Edition : SHIVA KUMAR

మల్లికార్జున హిల్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు.

మల్లికార్జున హిల్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు.

అలరించిన నాట్యకళ అకాడమీ సాంస్కృతిక ప్రదర్శనలు.. నిక్షిత గౌడ్‌కు కృతజ్ఞతలు

వైభవంగా 7వ రోజు మహా అన్నదానం.. సుమారు 4 వేల మంది భక్తుల రాక

అమీన్‌పూర్, సెప్టెంబర్ 21:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.బీరంగూడ పరిధిలోని మల్లికార్జున హిల్స్ కాలనీలో శ్రీ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కాలనీ మెంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపం వద్ద నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ఏడవ రోజు చేపట్టిన మహా అన్నదాన వితరణ స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఆకట్టుకున్న నాట్యకళ అకాడమీ ప్రదర్శనలు:అన్నదాన కార్యక్రమానికి ముందు వినాయక మండపం వద్ద ‘నాట్యకళ అకాడమీ’ ఆధ్వర్యంలో చిన్నారులు, కళాకారులతో ఏర్పాటు చేసిన శాస్త్రీయ, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కాలనీవాసులను ఎంతగానో అలరించాయి. కళాకారుల ప్రతిభాపాటవాలు, భక్తిరంజిత ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించిన నిక్షిత గౌడ్ కు కాలనీవాసులు, కమిటీ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.వైభవంగా మహా అన్నదానం:నవరాత్రులలో భాగంగా 7వ రోజు నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 3,500 నుంచి 4,000 మంది కాలనీవాసులు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అసోసియేషన్ సభ్యులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.ఒకే కుటుంబంలా కాలనీవాసులు:ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గత ఏడేళ్లుగా కాలనీలో వినాయక నవరాత్రులను ఎంతో ఐకమత్యంతో జరుపుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా కాలనీవాసులంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పండుగలు నిర్వహించుకోవడం తమ కాలనీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పండుగల నిర్వహణతో పాటు రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం అండగా నిలుస్తున్న నందారం రమేష్ గౌడ్ అన్న గారికి కాలనీవాసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.సేవ చేయడమే మాఅదృష్టం:అనంతరం నందారం రమేష్ గౌడ్ మాట్లాడుతూ, భగవంతుని దయతో కాలనీ ప్రజలకు, భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కలగడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ప్రజల ముఖాల్లో ఆనందం చూడటమే తమకు అసలైన సంతృప్తి అని, ప్రజల దీవెనలతో ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.ఈకార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నాట్యకళ అకాడమీ నిర్వాహకులు, మహిళలు, యువకులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.