మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు.

అమీన్ పూర్,ఫిబ్రవరి,19,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ సాయి కాలనీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బోయిని బాలమణి బాలరాజ్ మాట్లాడుతూ.భారతీయ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం పోరాడిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత నేటి యువతకు...