మహిళల స్వయం ఉపాధికి ఫెమినా మహిళ సేవా మండలి ఆదర్శంఉచిత బ్యూటిషన్, కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు.
మైనారిటీ మహిళలకు ఉపాధి మార్గం చూపుతున్న అలియా సుల్తానా సేవలు ప్రశంసనీయం. (స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,23:షాద్‌నగర్ పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఫరూక్‌నగర్ ఉర్దూ ప్రైమరీ స్కూల్ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్ర భవనంలో ఫెమినా మహిళ సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 90 రోజుల ఉచిత బ్యూటిషన్ మరియు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు శనివారం సందర్శించారు.ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రముఖ సంఘ సేవకురాలు అలియా సుల్తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ముస్లిం మైనారిటీ మహిళలు, నిరుద్యోగ...