MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 4:43 am Digital Edition : Medak Today

మహా ధర్నా కు తపస్ సంపూర్ణ మద్దతు.

పాపన్నపేట,మార్చ్,6,మెదక్ టుడే న్యూస్:డీఎస్సీ–2003 లో నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం మార్చి 7 తలపెట్టిన ధర్నాకు తపస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తపస్ నాయకులు మంగ నర్సింలు,మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తులసిరాం, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డీఎస్సీ–2003 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాల కారణంగా దీర్ఘకాలం పాటు నియామకాలకు దూరమై అనంతరం విధుల్లో చేరినప్పటికీ, వారికి పాత పెన్షన్ విధానం వర్తించకుండా చేయడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం. 57 ప్రకారం మరియు ఈ అంశంపై గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో డి ఎ స్ సి –2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. న్యాయమైన హక్కు సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాలో ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.