పాపన్నపేట,ఫిబ్రవరి,26,మెదక్ టుడే న్యూస్:మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవనీ ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు…గురువారం సాయంత్రం నార్సింగి ప్రధాన చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ…వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలన్నారు.ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు.మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పించారు.కానిస్టేబుళ్లు ప్రవీణ్, వెంకటేష్, తదితరులున్నారు.