MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 2:44 am Digital Edition : Shiva Kumar

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి ఎస్సైజి. చైతన్య కుమార్ రెడ్డి.

చేగుంట,జూన్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలో పోలీసులు,పి విష్ణు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద నుండి మక్కరాజుపేట రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థిని విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బందితో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద చేగుంట ఎస్సై జి. చైతన్యకుమార్ రెడ్డి సమక్షంలో విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి “డ్రగ్స్‌కు నో చెబుదాం జీవితాన్ని కాపాడుకుందాం” అంటూ మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపన కోసం చేతులు చాచి ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి మాట్లాడుతూ 1989 నుండి ఆంటీ డ్రగ్స్ డే నిర్వహిస్తున్నారు డ్రగ్స్ రహిత సమాజం నిర్మూలించుటకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి గంజాయి యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల వంటి మహమ్మారి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర డ్రగ్స్ రవాణా, విక్రయాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విష్ణు, ఎర్ర యాదగిరి, స్థానిక యువకులు బాలేష్, అక్బర్, నరేష్, ఎల్లేష్, జీవన్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.