MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 11:57 pm Digital Edition : Medak Today

మాదకద్రవ్యాల నిర్మూలనపై,యువత భవిష్యత్తు

ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి

చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలో శనివారం నాడు, దేశంలోనే విద్యార్థులు, యువత బంగారు భవిష్యత్తును మాదకద్రవ్యాలు,నాశనం చేస్తున్నాయని చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడమే “నశా ముక్త భారత అభియాస్”ప్రధాన ఉద్దేశం గా మెదక్ చౌరస్తా లో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ గుణంకాల ప్రకారం 25 ఏళ్లలోపు యువత అధికంగా బానిసలు అవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.మాదక ద్రవ్యాలు మానసిక, శారీరిక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అని, ఇవి యువతను చెడు మార్గంలో నడిపిస్తాయని, చదువులో వెనకబడేలా చేస్తాయన్నారు. ఒకసారి దీనికి బానిసైతే ఎంతటి ఆకృత్యాలు నేరాలు చేయడానికి వెనకాడనన్నారు. ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలని తగు సూచనలు తెలిపి ,మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ,ఎస్ఐ, సంయోద్దీన్ పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, బోనాల సర్పంచ్ రాములు, మొహమ్మద్ అలీ,తదితరులు పాల్గొన్నారు.