కొల్చారం,మే,27,మెదక్ టుడే న్యూస్:లారీలు రాక కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం నిలిచిపోయిందని రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. బుధవారం కొల్చారం మండలం చిన్న గణపురం గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. 25 రోజులుగా కొనుగోలు కేంద్రంలో వడ్లు నిలిచిపోవడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అరిసిపోయి తూకం వేసిన వడ్లు అలానే ఉండిపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలోని వడ్లు తూకం వేసి ఉండడంతో తరుగు పేరిట రైతులకు నష్టం జరగడంతో పాటు వర్షంతో మరోపక్క గుండెలు అదురుతున్నాయంటూ ఆందోళనకు దిగారు. ఆరుగాలం అప్పుడు తెచ్చి కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులకు నష్టం మిగిలిస్తే రైతుల పరిస్థితి అగ్గమ్మ గోచరంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వర్షాలు పడుతుండడంతో వర్షాకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వారి ధాన్యం వెంటనే లారీల్లో తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే రైతులే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
