MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 12:25 pm Digital Edition : Medak Today

లింగాయపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్ – రూ.26,183 నగదు స్వాధీనం•జిల్లా ఎస్ పి.శ్రీనివాసరావు.

•జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు.

పాపన్నపేట,జనవరి,5,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లి గ్రామంలోపేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు, జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు,ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, పాపన్నపేట పోలీస్ సిబ్బంది కలిసి జూదంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈదాడిలో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది:దాదిగారి కృష్ణగౌడ్, పుట్టి బాగయ్య, వగ్గు యాదయ్య, మెగావత్ కిషన్, నీరుడి లక్ష్మణ్.అదేవిధంగా పేకాటలో పాల్గొని పరారైన వ్యక్తులు:గుండమ్మ సాయిలు,పుట్టి బండాల సత్యనారాయణ,బెస్త వెంకటేశం,బుద్ధి సాయమ్మ,కర్రె సాయమ్మ సాయిలు,కోలా ధన్సింగ్.జూదం ఆడుతున్న ప్రదేశం నుండి మొత్తం రూ.26,183/- నగదును స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి పై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. పరారైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.ఈసందర్భంగా జిల్లా ఎస్ పి శ్రీడి.వి.శ్రీనివాసరావు,మాట్లాడుతూ,జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పేకాట,బెట్టింగ్ వంటి కార్యకలాపాల వలన ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని, ముఖ్యంగాయువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో చెడు మార్గాలను ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. కష్టపడానీదే ఏదీ ఊరికే రాదని, ప్రజలు కూడా ఇలాంటి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించి సహకరించాలని జిల్లా ఎస్ పి సూచించారు.