MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 1:55 am Digital Edition : Medak Today

లింగమయ్య కాలనీ లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం.

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాదిమంది భక్తులు

  • మాజీ కౌన్సిలర్ సదువు రాణి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వేడుకలు

అమీన్పూర్,మార్చి,27,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని లింగమయ్య కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. అమీన్పూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శ్రీమతి సదువు రాణి మరియు సదువు మల్లేష్ ముదిరాజ్ దంపతుల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, స్థానిక లింగమయ్య కాలనీ వద్ద రామాలయ దేవాలయం వద్ద ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం నిర్మించి మూడు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, వరుసగా మూడవ ఏడాది కూడా కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా జరిపించారు.

కళ్యాణ వేడుక – సాంస్కృతిక ప్రదర్శనలు:

వేలాదిమంది భక్తుల జయజయధ్వానాల మధ్య సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాంస్కృతిక నాటికలు, నృత్య రూపకాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి.

భారీ అన్నదానం:

కళ్యాణానంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 4,000 మందికి పైగా భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సదువు మల్లేష్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

ప్రతి ఒక్కరి సహకారం అభినందనీయం: సదువు మల్లేష్ ముదిరాజ్

ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సదువు మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. “స్వామివారి కృపతో లింగమయ్య కాలనీలో ఈ వేడుక ఇంత గ్రాండ్‌గా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయ నిర్మాణం కోసం మరియు ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవం దిగ్విజయం కావడం కోసం ఎంతోమంది దాతలు, కాలనీ వాసులు మరియు మిత్రులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరి ఐక్యమత్యం మరియు సహకారం వల్లే ఈ కార్యక్రమం ఇంత వైభవంగా సాధ్యమైంది” అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సదువు రాణి మల్లేష్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు, కాలనీ ముఖ్య నాయకులు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.