MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 12:59 am Digital Edition : Shiva Kumar

కుల దుహంకరణ సమాజానికి సవాళ్లుడిప్యూటీ ఎమ్మార్వో రమేష్.

చేగుంట,మే,30,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని చందాయిపేట్
గ్రామంలో, శనివారం నాడు చేగుంట తహసిల్దార్ శివప్రసాద్, సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా, ఆధ్వర్యంలో గ్రామంలో సివిల్ రైట్స్
డే నిర్వహించారు, డిప్యూటీ తాసిల్దార్ రమేష్ మాట్లాడుతూ, ఎస్సీ కులస్తులను కులం పేరుతో దూషించిన, గుడిలో రాకుండా అడ్డుపడిన, వారి పైన, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేస్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు.గ్రామంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరుపున 50 వేల రూపాయలు నగదు,విదేశీ చదువుల, కొరకు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమం లో చేగుంట, ఆర్ఐ సుజాత,ఉపసర్పంచ్ నాగేష్ గుప్తా,సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రామ సెక్రెటరీ కృష్ణ , గ్రామ రెవిన్యూ ఆఫీసర్ రత్న కుమారి,హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్,వార్డ్ సభ్యులు మధు, మహేష్,మహిళలు,గ్రామ ప్రజలు స్వామి గౌడ్, సిద్దిరాములు, బాబు, నర్సిములు,తదితరులు పాల్గొన్నారు,