కులం పేరుతో మహిళను దూషించిన ఘటనలో నిందితుల రిమాండ్- మెదక్ డి.ఎస్.పి
మెదక్,ఫిబ్రవరి,18,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజకీయ మద్దతు విషయంలో ఏర్పడిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కులం పేరుతో మహిళను దూషించడమే కాకుండా, ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసి చంపాలనే ప్రయత్నం చెసిన ఘటనకు సంబంధించి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మెదక్ డియస్పి డి. ప్రసన్నకుమార్ తెలిపారు.మెదక్ డియస్పి డి. ప్రసన్నకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.కాంగ్రెస్ పార్టీ మహిళ కార్యకర్త మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ...