కొత్తపల్లి బ్రిడ్జికి అప్రోచ్‌ రోడ్డు ఎప్పుడు?

వారం రోజుల్లో పనులు ప్రారంభించాలి..లేకుంటే భారీ ధర్నా. ప్రతిపక్షాలను తిట్టడం మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టండి:పద్మా దేవేందర్‌రెడ్డి. పాపన్నపేట,ఆగస్టు,10,మెదక్ టుడే న్యూస్:మెదక్‌–బొడ్మెట్‌పల్లి ప్రధాన మార్గంలోని కొత్తపల్లి వద్ద బ్రిడ్జికి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించి, వాహనదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ,బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్లతో బ్రిడ్జి నిర్మించినప్పటికీ అప్రోచ్‌ రోడ్డు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.బ్రిడ్జి...