కొనుగోలు కేంద్రంలో రైతు మృతి.
కొల్చారం,మే,22,మెదక్ టుడే న్యూస్:కుప్పపూసిన ధాన్యం రాసిన చూడడానికి వెళ్లి కొనుగోలు కేంద్రంలోని రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చిన్న ఘనపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటాపురం శంకరయ్య (54) గత నెల రోజుల క్రితం వరి పంట హార్వెస్టింగ్ చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. ధాన్యాన్ని ఆరబెట్టి తూకానికి సిద్ధం చేసి ఉంచారు. ఎంతకీ తూకం వేయకపోవడంతో నెల రోజులుగా నిర్వాహకుల వెంట తిరుగుతూ ఎండలో ధాన్యం కుప్ప వద్ద పడికాపులు కాశారు. ఈ క్రమంలో శుక్రవారం...