కొల్చారం,మే,22,మెదక్ టుడే న్యూస్:కుప్పపూసిన ధాన్యం రాసిన చూడడానికి వెళ్లి కొనుగోలు కేంద్రంలోని రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చిన్న ఘనపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటాపురం శంకరయ్య (54) గత నెల రోజుల క్రితం వరి పంట హార్వెస్టింగ్ చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. ధాన్యాన్ని ఆరబెట్టి తూకానికి సిద్ధం చేసి ఉంచారు. ఎంతకీ తూకం వేయకపోవడంతో నెల రోజులుగా నిర్వాహకుల వెంట తిరుగుతూ ఎండలో ధాన్యం కుప్ప వద్ద పడికాపులు కాశారు. ఈ క్రమంలో శుక్రవారం సైతం దాన్యం కుప్పకు వద్దకు వెళ్లి కూర్చున్న దగ్గరే హఠాత్తుగా తూలిపడి స్పృహ తప్పి పడిపోయాడు. తోటి రైతులు పైకెత్తి చూడగా విగత జీవుడై ఉన్నాడు. ఎండ దెబ్బకు గురై శంకరయ్య మృతి ఒడికి చేరుకున్నారని గ్రహించిన తోటి రైతులు బోరుమన్నారు. కుటుంబ సభ్యుల అక్రందనలు మిన్నంటాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే శంకరయ్య ప్రాణం తీసింది అని గ్రామస్తులు వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గ్రామాన్ని సందర్శించి శంకరయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లకు అక్కడి నుండే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, అధికారులను పంపించి శంకరయ్య కుటుంబానికి సహాయం అందించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు కేంద్రాలలోనే మగ్గుతుంది అన్నారు. ప్రభుత్వం ఎంతకీ నిర్లక్ష్య వైఖరి వినడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి లారీల సదుపాయం కల్పించి వెంట వెంటనే ధాన్యం తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
