•కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగంగా జరగాలి కలెక్టర్
•అక్రమాలకు తావు లేకుండా ధాన్యం కొనుగోలు
•27,993 మంది రైతుల నుండి 1,19,461.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు
•జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్,శంకరంపేట,(ఆర్)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి
జిల్లా పరిధిలోని శంకరంపేట్ (ఆర్) మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందో లేదో స్వయంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగంగా జరగాలని
గత సంవత్సరం ఇదే నెలలో 11,865 మంది రైతుల నుంచి 68,669.640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4.71 కోట్ల రూపాయలను చెల్లించగా…
ప్రస్తుత సీజన్ కి… ఇప్పటివరకు 27,993 మంది రైతుల నుండి 1,19,461.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కింద ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని, తేమ శాతం నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే ధాన్యం తూకాలు సక్రమంగా జరుగుతున్నాయా, గోదాముల్లో నిల్వలు గన్ని బ్యాగ్ లు పూర్తిగా ఉన్నాయన్నారు.అధికారులు రైతులకు సకాలంలో చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.