కోఆప్షన్ పదవికి విజయ్ కుమార్ రెడ్డి..!ఇచ్చిన హామీని అధిష్టానం నిలబెట్టుకుంటుందనే నమ్మకంనాలుగు వార్డుల్లో తనదైన చాతుర్యం చూపిన నేతరెడ్డి సామాజిక వర్గం నుంచి తనకే అవకాశం ఉందనిస్పష్టం
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,ఏప్రిల్,13,మెదక్ టుడే న్యూస్:షాద్‌నగర్ మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం పోటీ రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్న నేపథ్యంలో, మాజీ కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తనకే ఆ అవకాశం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.కోఆప్షన్ పదవి విషయంలో గతంలో పార్టీ అధిష్టానం తనకు రాజకీయంగా సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ హామీని ఈసారి తప్పకుండా నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.ముఖ్యంగా, మున్సిపాలిటీలో ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం...