MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 4:02 pm Digital Edition : SHIVA KUMAR

కేవల్ కిషన్ విగ్రహం వద్ద నివాళులర్పించిన,జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత..

కేవల్ కిషన్ విగ్రహం వద్ద నివాళులర్పించిన,
జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత

చేగుంట నవంబర్ 15 మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లా చేగుంట మండలం, పొలంపల్లి గ్రామ శివారులోని గల ముదిరాజ్ ముద్దుబిడ్డ కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి వద్ద తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత కేవల్ కిషన్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ. మెదక్ జిల్లాలో ప్రజా విప్లవానికి చేయూతనిచ్చి ప్రజలకు అనుకూలంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారు కేవల్ కిషన్. ముదిరాజు ముద్దుబిడ్డ కేవల్ కిషన్ అని అన్నారు. వారు బ్రతికి ఉన్నన్ని రోజులు నాకు ప్రజలే ముఖ్యమని అన్న కేవల్ కిషన్,వారి స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ బాటలు వేసేందుకు మేము కూడా సంతోషిస్తున్నాను అన్నారు. ముదిరాజుల్లో పుట్టడం ముదిరాజ్ బిడ్డలు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి అని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో జన జాగృతి నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.