రాష్ట్రంలో ఆరాచక పాలక సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సిట్ నోటీసుల్ని ఖండించిన మాజీ డిప్యూటీ స్పీకర్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్..
మెదక్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కి ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతూ ఆరాచక పాలన సాగిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు ఆరోపించారు.మాజీ సీఎం కేసీఆర్ గారి పై రేవంత్ సర్కార్ అక్రమంగా పెడుతున్న కేసులను నిరసిస్తూ ఆదివారం మెదక్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్ఎస్ శ్రేణులతో కలసి నల్ల జెండాలు కండువాలు ధరించి బైక్ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,సిట్ పేరుతో ఉద్యమ నాయకుడు,మాజీ సీఎం కేసీఆర్ను వేధిస్తున్నారని అన్నారు.కేసీఆర్కు సిట్ నోటీసులను ఖండించారు. సిట్ విచారణ పేరుతో ఉద్యమ నాయకుడిని వేధించడాన్ని వారు తప్పుబట్టారు. కాంగ్రెస్, రేవంత్ సర్కార్ వేధింపులను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మెదక్ లో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేపట్టామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీస్ జారీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. ప్రజలిచ్చిన ప్రజాస్వామ్య మాండేట్ను గౌరవించకుండా, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తుల పేరుతో వేధింపులకు పాల్పడటం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా సిట్ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్ప్పుదారి పట్టించటానికి ఫోన్ టాపింక్ పేరుతో తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్పై కక్షకట్టి వేధింపులకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు సక్రమంగా యూరియా అందించలేని చేతగాని ప్రభుత్వముందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం పోయి, రాక్షస రాజ్యం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ప్రజల కష్టాలను తీర్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు.10 సంవత్సరాలు కెసిఆర్ గారు తెలంగాణను అభివృద్ధి పథకంలో నడిపించారన్నారు.ఆసరా పింఛన్లు ,కల్యాణ లక్ష్మి షాది ముబారక్, రైతుబంధు కాలేశ్వరం ద్వారా పంటకు నీళ్లు అందించిన గొప్ప వ్యక్తి కెసిఆర్ పై కక్ష సాధింపులు భాగంగా రేవంత్ రెడ్డి అవమానించారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా కాలేశ్వరం పేరుతో ఫోన్ టైపింగ్లతో కుట్ర కుతంత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఇవన్నీటిని తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారు. 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రాలకు గురి చేస్తు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.అక్రమ కేసులు పెడుతున్నారు, ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి, ప్రజల మన్నేలను పొందేలా అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, 6 గ్యారంటీలను అమలు చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీశారు. ప్రజలు ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారని సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు,జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు విజయలక్ష్మి,మాయ మల్లేశం,భీమరి కిషోర్, నాయకులు జీవన్ రావు, సురేందర్ గౌడ్,జుబెర్ అహ్మద్,తుమ్మలక్ష్మీనారాయణ,ఇస్మాయిల్,సంతోష్,నరేష్, చంద్రశేఖర్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ వార్డుల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

