MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 3:25 pm Digital Edition : SHIVA KUMAR

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన డి.ఎం.హెచ్.ఓ.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన డి.ఎం.హెచ్.ఓ.

మెదక్,జూలై,17,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

శుక్రవారం వెల్దుర్తి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు.వర్షాకాలంలో ఆడపిల్లలు ఆరోగ్యంగా వుండాలని , వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , ఈ సీజన్ లో ముఖ్యంగా జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా,మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, వాంతులు విరేచనాలు మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం వుందని, కాబట్టి కలుషిత ఆహారం, నీరు తాగవద్దని, వేడి వేడి ఆహారాన్ని తినాలని, శుభ్రమైన మంచి నీటినే తాగాలని, ఆహార పదార్థాలపై మూతలు తప్పక పెట్టాలని, ఈగలు, దోమలు లేకుండా చూడాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని, చేతుల పరిశుభ్రత తప్పక పాటించాలని, జలుబు, జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవాలని, 14 – 15 సంవత్సరాల మధ్య వున్న అమ్మాయిలు హెచ్.పి.వి. వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని , జిల్లాలో ఇప్పటివరకు 70 % హెచ్.పి.వి. ఇమ్మ్యునైజేషన్ పూర్తిచేశామని, మిగిలిన వారికి కూడా టీచర్లు, తలితంద్రుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తామని, దీనివల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్, మరియు ఇతర క్యాన్సర్ ఇన్ఫెక్షన్లు రాకుండా ముందస్తుగానే నివారించవచ్చని, మొన్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నాడు అల్బెండజోల్ టాబ్లెట్ వేసుకోని వారు 20 వ తేది నాడు నిర్వహించే మాపప్ కార్యక్రమం రోజున తప్పక తీసుకోవాలని, చదువు కుంటున్న పిల్లలు చదువులు పూర్తి అయ్యేంతవరకు , తమ కాళ్ల మీద సొంతంగా నిలబడే వరకు , కనీసం 21 సంవత్సరాల వయసు దాటిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని, మానసికంగా , శారీరకంగా పూర్తిగా ఎదగని యుక్త వయసులో తొందరపడి పెళ్లి చేసుకోవడం వల్ల శారీరక , మానసిక సమస్యలు చాలా వస్తాయని, రక్తహీనతతో బాధపడుతారని, అలాంటి చిన్న వయసులో గర్భం ధరించడం వల్ల గర్భస్రావాలు జరుగుతాయని, పుట్టబోయే శిశువు కూడా సరైన బరువు లేక అనారోగ్యంతో పుడుతారని, కావున పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని శారీరక మానసిక సమస్యలు కొని తెచ్చుకోవద్దని తెలిపారు.హాస్టల్ రూంలను, వంటలు చేసే సామాగ్రిని, కిచెన్ ను, తాగునీటిని , వాష్ రూంలను, నీరు బయటికి పోయే నాళాలను , పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రత, ఫుడ్ పాయిజనింగ్ కాకుండా, దోమలు పుట్టకుండా , కుట్టకుండా , వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ హెడ్ మాస్టర్ , పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు తెలియజేశారు.