కర్నాల్‌పల్లి కొనుగోలు కేంద్రంలో హరీష్ రావు పర్యటన.. ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర అసహనం.

15 రోజులకు ఒక లారీ వస్తే రైతులు ఏమైపోవాలి?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ రావు. చేగుంట,మే,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న హరీష్ రావు, ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం...