MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 3:36 am Digital Edition : SHIVA KUMAR

కంపెనీ యజమాన్యం ముడి సరుకులు తరలిస్తుండగా అడ్డుకున్న విద్యుత్ అధికారులు.

చేగుంట,ఏప్రిల్,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పరిదిలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో గల కారబొన్ రిసోర్సస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రాష్ట్ర విద్యుత్ సంస్థకు 20 కోట్ల రూపాయలు బాకీ ఉండగా , కౌశిక్ గోష్ కంపెనీ లాస్ నడవడం వల్ల హైకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు, హైకోర్టు 31 మార్చ్ 26 నాడు బ్యాంక్ గ్యారంటీతో ఏడు కోట్ల రూపాయలు తో సెటిల్మెంట్ చేసుకోవడానికి తీర్పు ఇచ్చింది, కానీ రామయంపేట్ ఏ డి ఆదయ్య మాట్లాడుతూ మాకు అధికారికంగా ఎలాంటి అనుమతులు రాలేదు అని అన్నారు మీరు ఇలా కంపెనీలో ఉన్న ముడి సరుకులను తరలిస్తుండగా అడ్డుకోవడం జరిగిందని తెలిపారు, కంపెనీ యజమాని కౌశిక్ గోషే మాట్లాడుతూ మాకు హైకోర్టు అనుమతులు ఇవ్వడంతోనే ముడి సరుకులు తరలిస్తున్నామని గత రెండు రోజుల నుండి మెటీరియల్ ఇక్కడనే ఉండిపోయింది లారీలు క్రేన్లు అన్ని ఇక్కడనే ఉన్నాయి దీన్ని అడ్డుకోవడం చట్టరీత్య వ్యతిరేకమని అన్నారు, విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి ఎలాంటి గొడవలు జరగకుండా చూశారు.