కడుపు నొప్పి బాధతో విద్యార్థిని ఆత్మహత్య.
పాపన్నపేట,ఆగస్టు,21,మెదక్ టుడే న్యూస్: తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన వగ్గు రిషిత (14) మండలంలోని యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండగా, పలుమార్లు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ నొప్పి తగ్గలేదు. శుక్రవారం ఉదయం కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతూ రశిత...