MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 3:01 pm Digital Edition : SHIVA KUMAR

కడుపు నొప్పి బాధతో విద్యార్థిని ఆత్మహత్య.

పాపన్నపేట,ఆగస్టు,21,మెదక్ టుడే న్యూస్:

తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన వగ్గు రిషిత (14) మండలంలోని యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండగా, పలుమార్లు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ నొప్పి తగ్గలేదు.
శుక్రవారం ఉదయం కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతూ రశిత ఇంట్లో దిగులుగా ఉన్నట్లు తెలిసింది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతురాలి తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.