కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో హరీష్ రావును కలిసిన మహిళా విజేతలు.

•అమీన్‌పూర్ మహిళా విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందజేసిన మాజీ మంత్రి అమీన్‌పూర్,మార్చి,11,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమీన్‌పూర్‌లో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా విజేతలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు తన నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో విజేతలైన మహిళలు హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా విజేతలకు మెమెంటోలు మరియు నగదు బహుమతులను అందజేసి...