కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం డ్రైవర్లకు కలెక్టర్ సూచన
వాహన డ్రైవర్లకు ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్
అతివేగం, డ్రింక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ప్రమాదాలకు సాంకేతాలు
జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు

మెదక్,ఏప్రిల్,16,మెదక్ టుడే న్యూస్,
99 రోజుల ప్రగతి ప్రణాళికలో అరైవు-అలైవ్ కార్యక్రమంలో భాగంగామెదక్ మండల కేంద్రంలో బాలాజీ ఫంక్షన్ హాల్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై ద్విచక్ర వాహనదారులు, కారు డ్రైవింగ్ చేసేవారు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం పై పోలీస్-రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలోఅవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలోనే హార్ట్ ఎటాక్ గురైన వారికిసిపిఆర్ ద్వారా ప్రాణదానం చేయవచ్చు అనే నినాదంతో సర్జన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ప్రత్యక్షంగా విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,మెదక్ జిల్లాలో జీరో యాక్సిడెంట్ జోన్ గాతీర్చిదిద్దాలని అన్నారు.పోలీస్ రవాణా శాఖ సమన్వయంతో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల జరిగే ప్రాణం నష్టాలపైఈసమావేశంలో సుదీర్ఘంగా వివరించడం జరిగిందని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు అందరం కృషిచేద్దామని అన్నారు.. మానవ తప్పిదాలవలనే ప్రమాదాలు అధిక సంఖ్యలో మన జిల్లాలో జరుగుతున్నాయనివిలువైన నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలన్నారు. అలాగే, కాగా, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో తక్షణమే స్పందించి ప్రథమ చికిత్స ఎలా చేయాలి, క్షతగాత్రులను సత్వరమే సమీప ఆసుపత్రికి తరలించడం వంటి వాటి పై అవగాహన కల్పించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు మాట్లాడుతూ,నివేదికల ప్రకారం, అతివేగం మరియు అజాగ్రత్త వల్ల తరచుగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రోడ్డు భద్రతా చర్యలను కఠినతరం చేసి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడమే పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యం గా ముందుకు పోతున్నామన్నారు.మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ ప్రజల ప్రాణరక్షణ ధ్యేయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే రోడ్డు ప్రమాదాలపై మనకు కనువిప్పు కలగాలన్నారు. హెల్మెట్ సీడ్ బెల్ట్ మన ప్రాణాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయన్నారు. చిన్న నిర్లక్ష్యం వలనే ప్రమాదాలు అధికంగా జరుగుతాయన్నారు నేటి సమాజంలో యువత ఎక్కువగా ప్రమాదాలు బారిన పడుతున్నారని కుటుంబంలో కొడుకు ప్రమాదంలో చనిపోయినట్లయితే ఆ తల్లికి గర్భశోకం వెలకట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వాహనదారుడు కూడా నిబంధనలు తప్పనిసరి అన్నారు. ప్రయాణం ఎంత ముఖ్యమో గమ్యస్థానం చేరడం కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై కవితల రూపంలో సభలో వినిపించారు.అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రోడ్లపై బాధ్యతగా మెలగాలని
రోడ్ల ప్రమాదాల పట్ల చైతన్యం పెంపొందించే విధంగా పోలీస్- రవాణా శాఖ సమన్వయంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకు పోతుందన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ మైనర్ లు వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.ప్రతి ఒక్కరు బయటకు వెళ్లిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు వైద్య శిబిరాన్ని పరిశీలించారు.సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం అని పోలీస్, రవాణా శాఖ సమన్వయంతో ఈ అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతంగా కొనసాగుతూ, మంచిగా నిర్వహిస్తున్నారనిఅభినందించారు.వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలన్నారు.కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని,ఈ కార్యక్రమంలో,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్,మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్,అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
