జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
•మహిళా సాధికారతే సమాజ ప్రగతికి పునాది •అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ మెదక్,మార్చ్,9,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందితో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలోనే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర...