జీ+2 పర్మిషన్.. షట్టర్ల నిర్మాణం: బిహెచ్‌ఎల్ మెట్రో కాలనీలో యజమాని అరాచకం!
అమీన్‌పూర్,మే,28,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని బిహెచ్‌ఎల్ మెట్రో కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు పెరిగింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ, అనుమతికి మించిన అంతస్తులతో పాటు, వాణిజ్య అవసరాల కోసం అడ్డగోలుగా షట్టర్ల నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానిక కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్థానిక సమాచారం మేరకు, సదరు భవన యజమానికి అధికారులు కేవలం జి+2 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు మంజూరు చేశారు. అయితే, ఆ నిబంధనలను గాలికి వదిలేసిన యజమాని, అంతకు మించి అదనపు నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం...