–ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి
అమీన్ పూర్,మే,6,(మెదక్ టుడే ) న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని జయలక్ష్మి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తైక్వాండో అకాడమీ గురువారం ఘనంగా ప్రారంభమైంది. మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమీన్‌పూర్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అకాడమీని ప్రారంభించారు.ఈ సందర్భంగా రుష్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఆత్మరక్షణ విద్యల అవసరం ఎంతో ఉందని, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు తైక్వాండో వంటి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవరుస్తాయని పేర్కొన్నారు. స్థానికంగా ఇలాంటి అకాడమీలను ఏర్పాటు చేయడం వల్ల యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తైక్వాండో అకాడమీ మాస్టర్ హేమంత్, బోయిని సందీప్, సుశాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, అకాడమీ నిర్వాహకులు, స్థానిక నాయకులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
