జర్నలిస్టుల హక్కుల కోసం పోరుబాట-డిసెంబర్ 3న జర్నలిస్టుల మహాధర్నా..

(స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,29, మెదక్ టుడే న్యూస్: తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, తమ హక్కుల సాధన కోసం పోరుబాటే ఏకైక మార్గమైపోయిందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం సమాచార శాఖ కార్యాలయం వద్ద జరగనున్న మహాధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ,ఉమ్మడి రాష్ట్రంలో అమలైన జర్నలిస్టుల సంక్షేమ పథకాలు తెలంగాణలో పూర్తిగా గల్లంతయ్యాయని, ప్రభుత్వాల నిర్లక్ష్యం మరింత...