జన గణన 2027 మొదటి దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి చేగుంట మండల తహసీల్దార్,

చేగుంట,ఏప్రిల్,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని వడియారంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మూడు రోజుల జన గణన శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి చేగుంట మండల ఛార్జ్ ఆఫీసర్ శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన గణన 2027 మొదటి దశలో భాగంగా ఇండ్ల గణన నిర్వహిస్తామని, రెండు దశలలో 72 మంది ఎనుమారేటర్స్ కు, 13 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని, వారందరూ మే 9 నుండి మూడు రోజులపాటు హౌసింగ్ లిస్టింగ్ బ్లాక్ మ్యాపింగ్ చేస్తారని, మే 11...