జలాల్‌పూర్ మహకాళీ మాత ఆలయ విస్తరణకు చేగుంట ఉపసర్పంచ్ రఫీ 5 గుంటలు, ప్రముఖుల భూదానం.

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్‌పూర్ గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మహకాళీ మాత దేవాలయ అభివృద్ధి, విస్తరణ కోసం చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు చేగుంటకు చెందిన పలువురు ప్రముఖులు గొప్ప ఉదారత చాటుకున్నారు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ తన సొంత నిధుల నుండి 5 గుంటల భూమిని భూదానంగా ఇస్తూ దానికి సంబంధించిన పత్రాలను, విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేయగా, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కావేరి...