చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్‌పూర్ గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మహకాళీ మాత దేవాలయ అభివృద్ధి, విస్తరణ కోసం చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు చేగుంటకు చెందిన పలువురు ప్రముఖులు గొప్ప ఉదారత చాటుకున్నారు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ తన సొంత నిధుల నుండి 5 గుంటల భూమిని భూదానంగా ఇస్తూ దానికి సంబంధించిన పత్రాలను, విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేయగా, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కావేరి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో దైవభక్తి ఉంటేనే అన్యాయం, అధర్మం అంతరిస్తాయని, భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు; అలాగే ప్రముఖ నాయకులు అయిత పరంజ్యోతి మాట్లాడుతూ తాము కోరగానే దాతలు సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. ఈ దేవాలయ విస్తరణ నిమిత్తం ఉపసర్పంచ్ రఫీ 5 గుంటలు దానం చేయగా.. అయిత పరంజ్యోతి, తొడుపునూరి నగేష్, తొడుపునూరి మహేష్, కాశం శంకర్, కాసాని ముత్యాలు గౌడ్, మాశెట్టి నాగభూషణం, బచ్చు రవీందర్, తోడుపునూరి మోహన్ లు ఒక్కొక్కరు ఒక గుంట చొప్పున, అలాగే మంజుల – వెంకట్ రెడ్డి దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక గుంట భూమిని ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ పవిత్రమైన రోజున భూదానం చేసే భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతమని ఉపసర్పంచ్ రఫీ ఆనందం వ్యక్తం చేయగా, ఆలయ కమిటీ దాతలను శాలువాలతో ఘనంగా సత్కరించింది; ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎస్. రామారావు, ఏ. లక్ష్మణ్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, గోశాల నిర్వహణ బాధ్యులు దేవరాజ్, మొహమ్మద్ రఫీ, అయిత రఘు రాములు, అయిత పరంజ్యోతి,మ్యాకల శ్రీనివాస్, సీలువేరు ప్రకాష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
