ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన బీరంగూడ బ్రహ్మోత్సవాలు: రూ. 80.92 లక్షల ఆదాయం.
అమీన్‌పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఆలయ ఈవో శ్రీ శశిధర్ గుప్తా, చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ సమర్థవంతమైన నిర్వహణలో అంగరంగ వైభవంగా ముగిశాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారు చేసిన ముందస్తు ఏర్పాట్లు, పటిష్టమైన ప్రణాళికతో ఉత్సవాలు అత్యంత క్రమశిక్షణతో జరిగాయి.దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు సమక్షంలో ఈవో, చైర్మన్ గారలు స్వయంగా హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు....