MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 1:12 am Digital Edition : Medak Today

ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన బీరంగూడ బ్రహ్మోత్సవాలు: రూ. 80.92 లక్షల ఆదాయం.

అమీన్‌పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఆలయ ఈవో శ్రీ శశిధర్ గుప్తా, చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ సమర్థవంతమైన నిర్వహణలో అంగరంగ వైభవంగా ముగిశాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారు చేసిన ముందస్తు ఏర్పాట్లు, పటిష్టమైన ప్రణాళికతో ఉత్సవాలు అత్యంత క్రమశిక్షణతో జరిగాయి.దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు సమక్షంలో ఈవో, చైర్మన్ గారలు స్వయంగా హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆదాయం వివరాలు – భక్తుల అచంచల విశ్వాసం:

మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి సమకూరిన ఆదాయ వివరాలను ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్ వెల్లడించారు:
మొత్తం ఆదాయం: రూ. 80,92,132/- (దర్శనం టికెట్లు, టెండర్లు, అన్నదాన విరాళాల ద్వారా)
హుండీ ఆదాయం: రూ. 8,62,677/-
ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేశామని తెలిపారు. ఈవో శశిధర్ గుప్తా మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో ఆదాయం రావడం స్వామి అమ్మవార్లపై భక్తులకున్న భక్తికి నిదర్శనమని, వచ్చిన ప్రతి రూపాయిని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని స్పష్టం చేశారు.

అన్ని శాఖల సమన్వయమే విజయరహస్యం:

ఉత్సవాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈవో మరియు చైర్మన్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు:
పోలీస్ శాఖ: పటిష్ట బందోబస్తు నిర్వహించిన సీపీ, డీసీపీలు, ఏసీపీలు, సీఐలకు ప్రత్యేక ధన్యవాదాలు.
విద్యుత్ & జిహెచ్ఎంసి: నిరంతర విద్యుత్ సరఫరా చేసిన ఏడీలు, ఏఈలకు మరియు పరిశుభ్రతను పాటించిన జిహెచ్ఎంసి సిబ్బందికి ధన్యవాదాలు.
రెవెన్యూ: సమన్వయం చేసిన అమీన్‌పూర్ ఎమ్మార్వో కి కృతజ్ఞతలు.దాతలు, వాలంటీర్లు, మీడియా మిత్రులు మరియు భక్తులందరి సహకారం మరువలేనిదని, భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ ధర్మకర్తల కమిటీ సభ్యులు, అర్చకులు, మహిళా భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు..