పాపన్నపేట,మార్చి,17,మెదక్ టుడే న్యూస్: మండల కేంద్రం పాపన్నపేటలో మంగళవారం జరిగిన ఇఫ్తార్ విందులో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పేద ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే రంజాన్ తోఫా అందజేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్,కిసాన్ సెల్ జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి,నాయకులు నరేందర్ గౌడ్ గౌడ్,ఖలీమ్,సద్దామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.