MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 2:34 am Digital Edition : Shiva Kumar

ఇందిరమ్మ ఇండ్ల మీద దుష్ ప్రచారాలు (వదంతులు) నమ్మవద్దుఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్.

చేగుంట,జూన్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అని ఇబ్రహీంపూర్ ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ మాట్లాడారు కావున గత సంవత్సరంలో ఇబ్రహీంపూర్ కు ఇందిరమ్మ ఇల్లు 20 రావడం జరిగింది అందులో భాగంగా 04 ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ అవ్వగా 06 ఇందిరమ్మ ఇండ్లు వివిధ నిర్మాణ దశలో 01 ఇందిరమ్మ ఇల్లు పెండింగ్లో ఉండగా 09 ఇందిరమ్మ ఇల్లు షేర్ వాల్ కాంట్రాక్ట్ కు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ లబ్ధిదారులు మా వద్ద డబ్బులు లేకపోవడం వల్లనే కాంట్రాక్టుకు ఇవ్వడం జరిగిందని లబ్ధిదారులు తెలియజేయడం జరిగింది.ఇందులో ఎవరి బలవంతం లేదు మా ఇష్టపూర్వకంగానే కాంట్రాక్టు బేస్ కు అప్పగించామని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తెలియజేయడం జరిగింది. కాంట్రాక్టు వారు బిల్లులు తీసుకొని పరారు అయినరు అని చెప్పడం ఆ వాస్తవం తప్పుడు ప్రచారాలు చేయవద్దని డి ఈ ,ఏఈ వీరికి ఎలాంటి సంబంధం లేదు అని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసిన అటువంటి వారి మీద ఇకమీదట కఠిన చర్యలు తీసుకోబడుతాయి. ఇబ్రహీంపూర్ ఇందిరమ్మ లబ్ధిదారులు వివరించడం జరిగింది.