ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసిన సర్పంచ్,కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి-బాధితురాలు సంధ్య.
ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం. మెదక్,జూన్,15,మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామానికి చెందిన ఆర్. సంధ్య భర్త ఆర్. నవీన్‌కు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామ పెద్దల సూచన మేరకు ఇంటి నిర్మాణ బాధ్యతలను ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు బాధితురాలు సంధ్య తెలిపారు. కాంట్రాక్టర్ మొదట బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ, అనంతరం నిర్మాణ సామగ్రి సరఫరా నిలిపివేసి పనులను అర్ధాంతరంగా ఆపివేశాడని ఆమె ఆరోపించారు.నిర్మాణ...