MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 3:38 am Digital Edition : Shiva Kumar

ఇది హెల్త్ స్కీమ్ కాదు స్కామ్ లాగా కనబడుతుంది తపస్.

చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉద్యోగులందరికీ హెల్త్ స్కీమ్ లాగా లేదు.ఇది స్కాం లాగా కనబడుతుందని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దు అన్నారు . హెల్త్ కార్డులకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు లేనప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగుల అందరి జీతం నుండి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా , డిడిఓల అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం నుండి 1.5% కట్ చేయడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వద్దు అనుకున్న వారికి మినాయింపు ఇవ్వాలని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే, ఎవరు అప్లై చేసుకుంటే వారి నుండి మాత్రమే అమౌంట్ కట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల నుండి బలవంతంగా వసూలు చేయడం మంచిది కాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, నర్సింలు, మెదక్, నార్సింగ్ మండలాల అధ్యక్షులు నరేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.