హుస్నాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ సిద్ధం – సర్పంచ్ ఎన్నికల ముందస్తు వ్యూహాలపై కీలక సమీక్ష
ఎమ్మెల్యే కార్యాలయంలో నేతలతో విస్తృత సమీక్ష శంకుస్థాపన కార్యక్రమాలు, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చలు సర్పంచ్ ఎన్నికలకు దిశానిర్దేశం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్,30,నవంబర్,మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో) హుస్నాబాద్ పట్టణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశం నియోజకవర్గం మొత్తానికి ప్రాధాన్యతను చాటింది. పట్టణ మరియు గ్రామీణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరై ముఖ్యమంత్రిపై పర్యటన వివరాలను తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడంలో...